Nellore: రోడ్డుప్రమాదం.. బస్సు డ్రైవర్‌ మృతి.. 10 మందికి తీవ్రగాయాలు

నెల్లూరు ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

Update: 2024-05-22 06:11 GMT

Nellore: రోడ్డుప్రమాదం.. బస్సు డ్రైవర్‌ మృతి.. 10 మందికి తీవ్రగాయాలు

Road Accident: నెల్లూరులోని సున్నపుబట్టి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్‌ లారీని ఢీకొట్టి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News