పవన్ కల్యాణ్ విశాఖ లాంగ్‌మార్చ్‌కు ముందే జనసేనకు షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పాడేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఐదు నెలల పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఇక నుండి పార్టీలో కొనసాగలేనని లేఖలో స్పష్టం చేశారు.