Tirumala: తిరుమల శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ట్రస్టులకు భారీ విరాళం అందింది.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ట్రస్టులకు భారీ విరాళం అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పి.ఎం.ఎస్. ప్రసాద్ శ్రీవారి సేవలో భాగంగా కోట్లాది రూపాయల విరాళాన్ని అందజేశారు.
టీటీడీకి చెందిన పలు ట్రస్టుల కోసం ఆయన రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించారు. శనివారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో (EO) అనిల్ కుమార్ సింఘాల్‌ను కలిసి విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు.
శ్రీవారి ట్రస్టుల ద్వారా జరుగుతున్న సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలకు ఇంత భారీ విరాళం అందించినందుకు పి.ఎం.ఎస్. ప్రసాద్‌ను ఈవో ప్రత్యేకంగా అభినందించారు.