Payyavula Keshav: ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల రచ్చ.. మంత్రి పయ్యావుల కేశవ్ మండిపాటు

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రవర్తనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-02-20 06:31 GMT

దేవుళ్ల ఫోటోలు పట్టుకుని చెప్పులతో నిలబడతారా?".. అసెంబ్లీలో వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు!

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రవర్తనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు హిందూ సమాజం మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలా ఉందని ఆయన మండిపడ్డారు.

వైసీపీ సభ్యులు సభలో హద్దులు దాటి ప్రవర్తించారని పయ్యావుల ధ్వజమెత్తారు. దేవుళ్ల ఫోటోలు పట్టుకుని, కాళ్లకు చెప్పులతో నిలబడటం హిందూ ధర్మాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ సభలో ఇలాంటి దుశ్చర్యను ఎప్పుడూ చూడలేదు. వైసీపీ సభ్యుల తీరు చూసి మేమంతా షాక్‌కు గురయ్యాము" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల వేంకటేశ్వర స్వామి పట్ల వైసీపీ విధానం ఇదేనా అని జగన్మోహన్ రెడ్డిని మంత్రి నిలదీశారు. గత మూడు నెలలుగా దేవుడిని రాజకీయాల్లోకి లాగుతూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యుల చర్యలు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, దేవుడి పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దైవత్వాన్ని కలుషితం చేయడం సరికాదని హితవు పలికారు. సభలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చ అని, పవిత్రమైన సభలో దేవుడి ఫోటోలతో అపవిత్రంగా ప్రవర్తించడం సభ్యులకు తగదని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News