విశాఖపట్నం: రెండో విడత ఉచిత రేషను సరకులను ఇంత వరకు 11,14,653 కుటుంబాలకు ఉచితంగా అందజేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్.శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం కార్డుదారుల్లో 90 శాతం మందికి సరకుల పంపిణీ పూర్తయిందన్నారు.
162 శాశ్వత, సంచార రైతు బజార్ల ద్వారా 3870 క్వింటాళ్ల కూరగాయలు, 626 టన్నుల అరటిపండ్లు విక్రయించినట్లు చెప్పారు. అధిక ధరలకు సరకులు విక్రయిస్తున్న 233 దుకాణాలపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు.