ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, పిడుగులతో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, పిడుగులతో వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, పిడుగులతో వర్షాలు

Update: 2019-10-13 04:40 GMT

రెండురోజులుగా లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం మీద పడడంతో తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దాంతో కోస్తా, రాయలసీమలోని చోట్ల అనేక ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఉపరితలద్రోణి ఆవరించి ఉండటంతో 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కావడం భారీ వర్షాలకు బలం చేకూరిందని నిపుణులు అంటున్నారు. ఇదిలావుంటే రానున్న మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీని ప్రభావం కూడా ఆంధ్రపై పడే అవకాశం ఉందని వారంటున్నారు. 

Tags:    

Similar News