కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన

Update: 2019-10-20 03:05 GMT

శ్రీలంక తీరం సమీపంలోని నైరుతి బంగాళాఖాతం నుంచి కోస్తా వరకు ద్రోణి ఏర్పడింది. దీంతో సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురవడమే కాకుండా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు కోస్తాంధ్రలోని గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లాలోని రేపల్లె, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు, వినుకొండల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. విశాఖ జిల్లా భీమిలి, యలమంచిలి, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో శనివారం భారీ వర్షం కురిసింది.

Tags:    

Similar News