PSLV C-53 రాకెట్ ప్రయోగం సక్సెస్‌..

PSLV-C53: నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది.

Update: 2022-06-30 13:34 GMT

PSLV C-53 రాకెట్ ప్రయోగం సక్సెస్‌..

PSLV-C53: నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్ర‌యోగం. పీఎస్‌ఎల్వీ- సీ53 రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 365 కిలోల డీఎస్‌-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్‌, 2.8 కిలోల స్కూబ్‌-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో వాణిజ్య‌ప‌ర‌మైన రెండో మిష‌న్ ఇది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కాగానే, ఇస్రో శాస్త్ర‌వేత్త‌లంతా సంబురాల్లో మునిగితేలారు.

Tags:    

Similar News