బాలికల కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని బాలికల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని బాలికల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక ఆ సమాచారాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విద్యార్థిని బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ కేసు అంశంలో నిందితుడిపై పోలీసులు సుమోటోగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాగులుప్పలపాడు మండలంలోని ఓ ZPHSలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు బక్కముంతల వినయ్. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు డిప్యూటీ డీఈఓకి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థినులు, ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వినయ్‌ను స్కూల్ నుంచి తప్పించి అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.