Prakasam: డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్
School Bus on Fire: ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్,క్లీనర్‌కు మధ్య వివాదం బస్సు దగ్ధానికి దారి తీసింది.
Prakasam: డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్
School Bus on Fire: ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్, క్లీనర్‌కు మధ్య వివాదం బస్సు దగ్ధానికి దారి తీసింది. అర్దవీడు మండలం పాపినేనిపల్లిలో పిల్లలను స్కూలుకు తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. రోజు మాదిరిగానా విద్యార్ధులను బస్సులో స్కూల్ కు తరలించే క్రమంలో బస్సు నిలిచిపోయింది.
బస్సు డ్రైవర్ నబీ రిపేర్ చేస్తుండగా వెనుకనుంచి వచ్చిన క్లీనర్ గోపాల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బస్సు పూర్తిగా తగులపడిపోయింది. బస్సు డ్రైవర్ నబి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అర్దవీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యానికి తనపై చాడీలు చెబుతున్నాడని డ్రైవర్ ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.