Nellore: కరోనా వైరస్ పై అవగాహన... పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ

Update: 2020-03-16 06:00 GMT

నెల్లూరు: పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో దర్గామిట్ట, ప్రగతి నగర్ నందు డాక్టర్ నరసింహారావు నిర్వహణలో కరోనా నివారణకు, ఇంటి ఇంటికి తిరిగి కరోనా వైరస్ పై అవగాహన కల్పించి, ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా డా. నరసింహారావు మాట్లాడుతూ... కరోనా వైరస్‌కు చికిత్స కంటే, ముందు జాగ్రత్తలతో నియంత్రణ మేలని అన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే వైర్‌స్ ను దూరంగా ఉంచవచ్చన్నారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని, తుమ్మినా, దగ్గినా కర్చీఫ్‌ అడ్డుపెటుకోవాలని సూచించారు. మాస్క్‌లు ధరించాలన్నారు. వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రమేష్ రాజ్, సూర్య, సుధాకర్, ప్రేమ్, సాయి, నవతేజ్, ప్రకాష్, రాజేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News