పవర్‌ కెనాల్‌కు గండి.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పవర్‌ కెనాల్‌కు గండి.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం పవర్‌ కెనాల్‌కు గండి.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Update: 2019-09-29 12:34 GMT

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు ఏజెన్సీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుత్‌ కెనాల్‌కు గండి పడటంతో ఇబ్బందులు తలెత్తినట్లు విద్యుత్‌ శాఖ తెలిపింది. అయితే జెన్‌కో నిర్వహిస్తున్న మరమ్మతులకు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయి. దీంతో 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతికి అంతరాయం కలిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే వీలైనంత త్వరగా విద్యుత్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేస్తామని జెన్ కో స్పష్టం చేసింది. 

Tags:    

Similar News