Guntur: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన హత్య కేసులోని ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Guntur: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన హత్య కేసులోని ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7 వ తేదీన గణేష్ అనే వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్యకి పాల్పడ్డారు నలుగురు వ్యక్తులు. హత్య చేసిన నలుగురితో పాటు వారికి సహకరించిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకున్నట్టు డీఎస్పీ అజీజ్ తెలిపారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని గుంటూరు డీఎస్పీ అజీజ్ తెలిపారు. దుర్గారావు చెల్లిని గణేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడని... ఇది నచ్చని దుర్గారావు గణేష్‌ను హత్య చేసినట్లు హత్యకు గల కారణాన్ని వివరించారు పోలీసులు.