ఓటర్లకు దొంగపట్టాలు.. వల్లభనేని వంశీపై కేసు నమోదు.. మరో నేత అరెస్ట్

ఏపీలో టీడీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటునారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అదుపులోకి

Update: 2019-10-19 05:48 GMT

ఏపీలో టీడీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటునారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉండగా.. కరణం బలరాం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూన రవికుమార్ లు కేసుల్లో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో ఇద్దరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపారు. మొన్నటి ఎన్నికల సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఆరోపించారు.

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా కూడా వంశీ.. బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు లోని పలు గ్రామాల్లో వేల సంఖ్యలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు శుక్రవారం మధ్యాహ్నం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి, ఏపీ ప్రభుత్వంపై వెంకట రమణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. 

Tags:    

Similar News