PM Modi: రేపు కర్నూలుకు ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi: రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

Update: 2025-10-15 06:07 GMT

PM Modi: రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు 13వేల 429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News