గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం.. మహిళలు, గ్రామస్తులపై ఎస్‌ఐ వీరంగం

Prakasam: సమస్యలు పరిష్కరించని నాయకుడు తమ గ్రామానికి రావొద్దని ఎమ్మెల్యే మధుసూదన్‌ను..

Update: 2022-08-07 08:15 GMT

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం.. మహిళలు, గ్రామస్తులపై ఎస్‌ఐ వీరంగం

Prakasam: సమస్యలు పరిష్కరించని నాయకుడు తమ గ్రామానికి రావొద్దని ఎమ్మెల్యే మధుసూదన్‌ను మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా పెరుగుపల్లిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటును తట్టుకోలేని ఎమ్మెల్యే వెనుదిరిగారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెరుగుపల్లికి వచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్‌ను గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికలకు ముందు పశువుల బీడును తిరిగి గ్రామానికి అప్పగిస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ప్రశ్నించారు. పశువుల బీడును గ్రామానికి అప్పగించేంత వరకు తమ గ్రామంలోకి రావద్దంటూ అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న మహిళపై వెలిగొండ ఎస్‌ఐ వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక వాగ్వివాదానికి దిగారు. మహిళలు కాబట్టి వదిలేశాను లేకపోతే కథ వేరేగా ఉండేదంటూ బెదిరింపు ధోరణితో వేలు చూపిస్తూ హెచ్చరించారు ఎస్‌ఐ. దీంతో ఆగ్రహించిన మహిళలు స్థానికులు ఎస్‌ఐపై వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేనే ఉద్దేశపూర్వకంగా పోలీసులను మహిళలపైకి ఉసిగొల్పాడని ఆరోపించారు స్థానికులు.

Tags:    

Similar News