Peddireddy: చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం 600 హామీలు ఇస్తారు
Peddireddy: హామీలిచ్చి నిలబెట్టుకునేది కేవలం జగన్ మాత్రమే
Peddireddy: చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం 600 హామీలు ఇస్తారు
Peddireddy: ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక మోసపూరిత హామీలు ఇస్తారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హామీలిచ్చి నిలబెట్టుకునేది కేవలం సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు 600 హామీలిస్తున్నారని.. తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలును మర్చిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 99 శాతం ఎన్నికల హామీలను అమలు చేశామన్నారు పెద్దిరెడ్డి. సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. జగన్‌ను రెండోసారి సీఎంను చేసి.. ఆయనకు అండగా నిలవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి.