ఇవాళ విశాఖపట్నంకు జనసేనాని పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఉత్తరాంధ్ర నేతలతో భేటీ కానున్న జనసేనాని
ఇవాళ విశాఖపట్నంకు జనసేనాని పవన్ కళ్యాణ్
Pawan Kalyan: రానున్న ఎన్నికలకు తమ పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తోంది జనసేన. పొత్తుల నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై జనసేనాని కార్యకర్తలు,నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖపట్నంకు వెళ్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మూడురోజుల పాటు విశాఖలో మకాం వేయనున్న పవన్ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో వరుస భేటీలు, సమీక్షలు జరపనున్నారు. ఇక విశాఖ పర్యటన అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఢిల్లీ పర్యటన అనంతరం పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.