Pawan Kalyan speech: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.. అది మీవల్లే సాధ్యం : పవన్ కళ్యాణ్
Pawan Kalyan speech in AP assembly sessions: గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో జైల్లో పెట్టి వేధించింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan
Pawan Kalyan speech in AP assembly sessions: గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో జైల్లో పెట్టి వేధించింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీని అన్ని విధాల వెనక్కి తీసుకెళ్లింది కూడా గత ప్రభుత్వమే అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంపై జనంలో నమ్మకం ఏర్పడిందని, దానికి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు విస్తరించడానికి ఆయనే కారణమని చెప్పుకొచ్చారు.ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.