శాసనమండలి రద్దుపై స్పందించిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం జరిగడంపై జససేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు

Update: 2020-01-27 14:10 GMT
Pawan kalyan File Photo

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం జరిగడంపై జససేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పరిపాల వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే ఏకంగా మండలి రద్దు చేయడం సహేతుకం కాదన్నారు. మండలి రద్దుతో రాష్ట్రాబివృద్దికి ఉపయోగించే అవకాశాన్ని కోల్పోయినట్లేనని పవన్ కళ్యాన్ అన్నారు. శాసనమండలి రద్దు సరైన చర్య కాదన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో శాసన మండలి పునరుద్ధరించారని సీఎం జగన్ ఇప్పుడు మండలి రద్దు చేయడం సరైంది కాదని తెలిపారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మండలి రద్ద చేయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యవస్థలను తొలిగించుకుంటూ పోవడం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అసలు శాసనమండలికి ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణంలోకి తీసుకోవాలనే అలాంటి చర్యలు ఏమి తీసుకోలేదని పవన్ దుయ్యబట్టారు.

రాజ్యాంగాని రూపొందించిన వారు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభలు ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని, అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం సరికాదని అనిపించినప్పుడు మండలిలో దానిపై చర్చ జరుగుతుందని, తప్పులు సరిచేసుకోవాలిన తెలియజేస్తుందన్నారు. పెద్దల సభలో మేథోపరమైన ఆశయం కోసం మండలి ఏర్పాటైందని పవన్ కళ్యాణ్ అన్నారు.

  

Tags:    

Similar News