Andhra Pradesh: పవన్ ఎంట్రీ... సోము ఎగ్జిట్!

Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీతో అడుగులేస్తున్నారు.

Update: 2022-06-05 09:50 GMT

Andhra Pradesh: పవన్ ఎంట్రీ... సోము ఎగ్జిట్!

Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీతో అడుగులేస్తున్నారు. 2014లో చివరి నిమిషంలో రంగం ప్రవేశం చేసిన పవన్ 2019లో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ముందస్తు వ్యూహంతో బరిలో నిలవాలని టార్గెట్ రీచ్ అవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పొత్తు లెక్కలు తేల్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు పవన్ కల్యాణ్. ఏపీ బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సోమువీర్రాజు వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు పవన్. సోముతో పార్టీకి లాభమో నష్టమో ఆలోచించుకోవాలన్నారు. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ సైతం వివరించారు.

ఏపీలో బీజేపీ ఎదుగదల కోసం పార్టీ ఎంతగా ప్రయత్నిస్తున్నా సోము వ్యవహారశైలితో నెత్తినొప్పి కలుగుతోందన్న సంకేతాలిచ్చారు పవన్ కల్యాణ్. పొత్తు కొలిక్కి తేవాలనుకుంటునన్న తరుణంలో సోమువీర్రాజు బీజేపీ చీఫ్‌గా ఉంటే ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. అదే సమయంలో ఏడాదిగా జరిగిన పరిణామాలు ఏకరువు పెట్టారు. వచ్చే రోజుల్లో సోము వీర్రాజుతో వేదిక పంచుకోనని ఆయనను పార్టీ చీఫ్‌గా తప్పిస్తేనే ఏదైనానంటూ కుండబద్ధలు కొట్టేశారు పవన్ కల్యాణ్. ఢిల్లీ పెద్దలతో స్నేహం గల్లీ లీడర్లతో వైరం అసలు వర్కౌట్ కాదన్నారు. ఒకరిపై ఒకరు అపనమ్మకంతో పనిచేయలేమన్నారు. ఇలాంటి వ్యవహారం ఉభయులకు నష్టం కలిగిస్తుందన్నారు జనసేనాని. సోమువీర్రాజు విషయంలో త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని పెద్దలకు సూచించారు.

పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌తో బీజేపీ పెద్దలకు ఏపీ రాజకీయాలను జనసేన కోణంలో చూడటం మొదలుపెట్టారు. ఏపీలో బీజేపీ సిచ్యువేషన్ మెరుగవ్వాలి. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యేలు గెలవాలి. అందుకు తగిన పరిస్థితులు ఏర్పడేలా చేయాల్సిన బాధ్యత తమపైనే ఉందన్న బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. మొత్తంగా పవన్ వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామన్న ఢిల్లీ పెద్దలు పవన్ కల్యాణ్‌కు హామీ ఇచ్చారు. అందుకు తగిన వాతావరణం క్రియేట్ చేస్తామన్నారు. అంటే మొత్తంగా త్వరలో ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ నియామకం జరిగే అవకాశం కన్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం జనసేన పొత్తును దృష్టిలో ఉంచుకొనే అడుగులు వేసే అవకాశం కన్పిస్తోంది. 

Tags:    

Similar News