Vijayawada: విజయవాడలో ఉద్రిక్తత.. వైకాపా నేత జోగి రమేశ్‌ ఇంటికి నిప్పు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో వైకాపా నేత జోగి రమేశ్‌ ఇంటిని తెదేపా శ్రేణులు ముట్టడించగా నిప్పు పెట్టిన ఘటన ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతకు దారి తీసింది.

Update: 2026-02-01 12:09 GMT

Vijayawada: విజయవాడలో ఉద్రిక్తత.. వైకాపా నేత జోగి రమేశ్‌ ఇంటికి నిప్పు

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత జోగి రమేశ్‌ నివాసాన్ని తెదేపా శ్రేణులు ముట్టడించి భారీగా నిరసన చేపట్టారు.

ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు జోగి రమేశ్‌ ఇంటికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

తెదేపా శ్రేణులు ముట్టడికి వస్తున్నారన్న సమాచారంతో జోగి రమేశ్‌ ముందుగానే తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా, శనివారం ఇబ్రహీంపట్నం ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం జోగి రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ, పరకామణి, కల్తీ మద్యం కేసులపై తెదేపా నాయకత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.


Tags:    

Similar News