Pawan Kalyan: కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి
Pawan Kalyan: తాను పర్యావరణ ప్రేమికుడినని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan
Pawan Kalyan: తాను పర్యావరణ ప్రేమికుడినని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో పర్యావరణాన్ని కాపాడటం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పొల్యూషన్ బోర్డ్ అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఏ పనికైనా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమని.. ఏపీలోని 974 కిలోమీటర్ల కోస్టల్ ప్రాంతంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని దానికి తగిన సూచనలు..సలహాలు అందించాలని కోరారు. కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.
నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరం. మేం చెప్పడానికి కాదు.. వినేందుకే సిద్ధంగా ఉన్నాం. ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తోంది. కాలుష్యం పెరుగుతోంది అని పవన్ కల్యాణ్ తెలిపారు.