Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన పవన్.. కీలక ఆదేశాలు జారీ
Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యాకారులు ఆందోళనకు దిగారు. ఫార్మా కంపెనీల ప్రభావంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళనకు దిగారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యాకారులు ఆందోళనకు దిగారు. ఫార్మా కంపెనీల ప్రభావంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉప్పాడకు రావాలంటూ నినదించారు. అయితే విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళనపై స్పందించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాను గుర్తించామని.. అందులో భాగంగానే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మత్స్యకార ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల సమస్యలను పరిగణలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో మాట్లాడలేకపోతున్నట్టు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఉప్పాడ మత్స్యకారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు.