సీఎం జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశమైన జగన్‌ .. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎంపీలకు

Update: 2019-11-15 13:20 GMT
CM jagan

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశమైన జగన్‌ .. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎంపీలకు వివరించారు.
 

కేంద్ర విద్యాలయాలకు నిధులు, బొగ్గు కొరత, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల వివరాలపై ఎంపీలకు అవగాహన కల్పించారు. వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి నిధులు వచ్చేలా ఎంపీలు కృషి చేయాలని జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సమావేశాల్లో కోరుతామని వైసీపీ ఎంపీలు వెల్లడించారు. విభజన హామీల అమలు కోసం పార్లమెంట్ ‌ వేదికగా ఒత్తిడి చేస్తామని చెప్పారు. పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరుతామన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు వైసీపీ ఎంపీలు 

keywords  : Parliamentary Party meeting,CM Jagan,andhrapradesh,YSRCP,MP,Tadepalli 

Tags:    

Similar News