Kurnool: పహల్గాం కాల్పులు కలిపిన బంధం

Kurnool: జమ్మూకశ్మీర్‌లో పహల్గాం కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2025-07-04 05:00 GMT

Kurnool: పహల్గాం కాల్పులు కలిపిన బంధం

Kurnool: జమ్మూకశ్మీర్‌లో పహల్గాం కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దురదృష్టకరమైనదే అయినా… ఓ కుటుంబానికి మాత్రం ఐదేళ్ల తర్వాత సంతోషాన్ని తీసుకొచ్చింది.

పహల్గాం ఘటన అనంతరం, అక్కడి ప్రభుత్వం స్థానికుల వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా సాంబా జిల్లా గంగూవాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆవులు మేపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. తనను వీరేశ్‌, మంత్రాలయం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో పోలీసులు, మంత్రాలయం ఎస్సై శివాంజల్‌కు సమాచారం ఇచ్చి, వీరేశ్ ఫోటోలను వాట్సప్ ద్వారా పంపించారు.

అనంతరం జరిగిన విచారణలో… అతడు కర్నాటక రాష్ట్రం, చెట్నిహళ్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన పేరు వీరేశ్. వింత ఏమిటంటే… వీరేశ్ మతిస్థిమితం కొద్దిగా స్థిరంగా లేక… ఊరిలో తిరుగుతూ ఉండేవాడట. ఐదేళ్ల క్రితం ఊరిని వదిలి వెళ్లిపోయాడు. ఆ సమయంలో భార్య యల్లమ్మ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మతిస్థిమితి కారణంగా ఫిర్యాదు తీసుకోలేదట.

అయితే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో అతడిని గుర్తించిన పోలీసులు… వీరేశ్ ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపించగా, వారు ఆనందభాష్పాలు పెట్టారు. వెంటనే ఫోన్‌లో వీరేశ్‌తో మాట్లాడించి, మళ్లీ ఇంటికి రప్పించారు.

ఐదేళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడు తిరిగి రావడంతో… కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పహల్గాం కాల్పుల ఘటన ఎంతగానో బాధ కలిగించినా… ఇదో తీపి పరిణామాన్ని కూడా తెచ్చింది.

Tags:    

Similar News