Anakapalle: సాహితీ ఫార్మా అగ్నిప్రమాద బాధితులకు కొనసాగుతున్న చికిత్స
Anakapalle: నిన్న అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్
Anakapalle: సాహితీ ఫార్మా అగ్నిప్రమాద బాధితులకు కొనసాగుతున్న చికిత్స
Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతోంది. కేజీహెచ్ బర్నింగ్ వార్డులో బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి అమర్‌నాథ్ పరామర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.