గ్రామ/వార్డు సచివాలయం : 72 గంటల్లోగా పనులు అయ్యే శాఖలు ఇవే..

గ్రామ/వార్డు సచివాలయం : 72 గంటల్లోగా పనులు అయ్యే శాఖలు ఇవే..

Update: 2019-10-02 02:21 GMT

జాతిపిత మహాత్మ గాంధి కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏపీలో నేడు సాకారమవుతోంది. గ్రామాల నుంచే పరిపాలన సాగాలన్న ఎన్నో ఏళ్ల డిమాండ్ ఏపీలో నెరవేరబోతోంది. తూర్పు గోదావరిజిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా నేడు ప్రారంభించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు నేటి నుంచి ప్రజలకు అందుబాటు రానున్నాయి. రికార్డుస్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామకం చేపట్టి.. ఏక్కడ అవకతవకలకు పాల్పడకుండా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వచ్చినా అవి అవాస్తవాలుగానే మిగిలిపోయాయి..ఇకపై సచివాలయ వ్యవస్థ ఆధారంగా 500 రకాల ప్రభుత్వ సేవలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టా, జనన మరణ, నివాస, క్యాస్ట్ ధ్రువపత్రాలు వంటి వాటికి కోసం పేదల ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇక మాయం కానుంది. సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు జరగకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించడానికి గాను ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ఉంచుతారు.

ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను కూడా సచివాలయంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలను మూడు విభాగాలుగా అధికారులు వర్గీకరించారు. వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను కేవలం15 నిమిషాల్లో అందించేలాగ ఒక విభాగం, 148 రకాల సేవల( పింఛన్, రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు)ను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అందించేలోగా మరో విభాగం, 311 రకాల సేవలను 72 గంటల కంటే ఎక్కువ సమయంలో అందించేలా మరో విభాగాన్ని ఈ వ్యవస్థలో ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందించేవి (వ్యవసాయం 8, పశుసంవర్ధక 6, పౌరసరఫరాలు 1, హోమ్ శాఖ 6, మున్సిపల్ శాఖ 8 , పంచాయితి రాజ్ 6,రెవెన్యూ 2, సంక్షేమ శాఖలు 10) శాఖలు ఉన్నాయి. ఇక 72 గంటల్లోగా అందించేవి(వ్యవసాయం 26, పశుసంవర్ధక 1, గృహ నిర్మాణ 1, పౌరసరఫరాలు 8, విద్యుత్ 12, హోమ్ శాఖ 8, కార్మిక, ఉపాధి శిక్షన 9, మున్సిపల్ శాఖ 15, పంచాయితి రాజ్ 6, స్టాంపులు రిజిస్ట్రేషన్ 2, రెవెన్యూ 16, సంక్షేమ శాఖలు 25) శాఖలు ఉన్నాయి. 72 గంటలు దాటిన తరువాత అందించే సేవలు(వ్యవసాయం 26, పశుసంవర్ధక 5, గృహ నిర్మాణ 1, పౌరసరఫరాలు 2, విద్యుత్ 101, హోమ్ శాఖ 53, కార్మిక, ఉపాధి శిక్షన 8, మున్సిపల్ శాఖ 24, పంచాయితి రాజ్ 19, స్టాంపులు రిజిస్ట్రేషన్ 2, రెవెన్యూ 45, సంక్షేమ శాఖలు 27) శాఖలుగా ఉన్నాయి.  

Tags:    

Similar News