Suresh: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
Suresh: అన్ని విభాగాల్లోని ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టారు
Suresh: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
Suresh: మున్సిపల్ ఉద్యోగుల అంతర్గత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. విశాఖలో మున్సిపల్ ఎంప్లాయిస్ నిర్వహించిన మహసభలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు సహా అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి పెట్టారన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు 11 అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. వారి సమస్యలపు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తొలి కేబినెట్‌లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించామన్నారు.