సీఎం వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ..

సీఎం వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ.. సీఎం వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ..

Update: 2019-10-09 04:33 GMT

సీఎం జగన్‌ వద్దకు నెల్లూరు పంచాయితీ చేరింది. బుధవారం సాయంత్రం క్యాంప్‌ ఆఫీసులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి లతో జగన్ భేటీ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతలు విభేదాలు, ఆధిపత్య పోరుపై జగన్ సీరియస్ అయ్యారు. పంతాలకు పోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని వైసీపీ అధిష్టానం ఈ అమాశాన్ని సీరియస్ గా తీసుకుంది. సమన్వయంతో వ్యవహరించాల్సిన జిల్లా అధ్యక్షుడు కాకానిపై సీఎం గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తాను లేని సమయంలో తన ఇంటిపై దాడిచేశారని, కుటుంబసభ్యులపై పరుష పదజాలంతో దూషించారని ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సరళ ఫిర్యాదుతో శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లు 290, 427, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరి అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఈ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Tags:    

Similar News