Minister Narayana: త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు’.. మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
Minister Narayana: పేదలకు టిడ్కో ఇళ్లు కేటాయించే యోచన చేస్తున్నాం
Minister Narayana: త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు’.. మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
Minister Narayana: ఆపరేషన్ బుడమేరును రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించిన వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అన్నారు. పేదలకు ప్రత్యామ్నాయంగా టిడ్కో ఇళ్లు కేటాయించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పేదలను ఇబ్బందులు పెట్టబోమని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు రేపు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్చత సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు.
ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నేషనల్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న హెలీపాడ్ ను పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.