Botsa Satyanarayana: విశాఖ ఎంపీగా ఝాన్సీ పోటీపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: అసంతృప్తిగా ఉన్నవాళ్లతో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది

Update: 2024-01-07 14:15 GMT

Botsa Satyanarayana: విశాఖ ఎంపీగా ఝాన్సీ పోటీపై స్పందించిన మంత్రి బొత్స 

Botsa Satyanarayana: విశాఖ ఎంపీగా బొత్స ఝాన్పీ పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోటీపై అధిష్టానం ఏది చెప్తే అదే అనుసరిస్తామన్నారు మంత్రి బొత్స. అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సమన్వయ కర్తల మార్పుల్లో ఆందోళనలు లేవని. .కేవలం అసంతృప్తి మాత్రమే ఉందన్నారు. అసంతృప్తిగా ఉన్నవాళ్లతో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లాలని కోరుకోమని.. ఒకరు పోయినా కూడా మరో 100 మంది వస్తారంటూ మంత్రి బొత్స అన్నారు.

Tags:    

Similar News