అమరావతి నుండి తరలిపోతున్న వలస కార్మికులు

అమరావతి నుండి తరలిపోతున్న వలస కార్మికులు అమరావతి నుండి తరలిపోతున్న వలస కార్మికులు

Update: 2019-10-14 01:48 GMT

ఆర్థిక మందగమనం, ఇసుక కొరత కారణంగా నిర్మాణ పనులు బాగా తగ్గిపోవడంతో వేలాదిమంది వలస కార్మికులు అమరావతి రాజధాని నుండి తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళుతున్నారు. వీరంతా పనులకోసం బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి వచ్చారు. ఉత్తర భారత రాష్ట్రాల నుండి సుమారు 50,000 మంది దాకా కార్మికులు రాజధాని ప్రాంతంలో పనిచేయడానికి వచ్చారు. వీరంతా రాజధాని ప్రాంతంలో పెద్ద చిన్నతరహా అపార్టుమెంట్లు, విల్లాస్, ఇళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ , మల్టీప్లెక్స్‌ల నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అయితే గత కొన్ని నెలలుగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వివిధ కారణాలతో కొత్త ప్రాజెక్టులు ఆగిపోవడం, భారీ వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడటంతో నిర్మాణాలు ఆగిపోయాయి. దాంతో రాజధాని ప్రాంతాన్ని విడిచివెళుతున్నారు.

20 శాతం పనులు ఇంకా పూర్తి కానీ కారణంగా.. తన అపార్ట్మెంట్ ఫ్లాట్లను విక్రయించ లేదని, దీనికి కారణం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి బ్లాక్ మార్కెట్లో కూడా ఇసుక దొరకడం లేదని చెప్పారు వెంకట్ అనే బిల్డర్. కాగా 30 రకాల ట్రేడ్‌లకు సంబంధించిన వేలాది మంది కార్మికులు.. జీవనోపాధి కోసం నిర్మాణ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు నిలిపివేయడం వలన చిత్రకారులు, పాలరాయి కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి, ప్లంబర్లు, రోజువారీ వేతన నిర్మాణ కార్మికులు తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. తామంతా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాల శివార్లలో చిన్న ఇళ్లలో ఉంటూ.. తమ కుటుంబాలకు నెలకు 7,000 నుండి 15,000 రూపాయల దాకా పంపించేవారిమని.. ఇప్పుడు తమకు ఆదాయం లేదని రాజస్థాన్ నుండి వచ్చిన వలస కార్మికుడు మహ్మద్ సలీమ్ అన్నారు.

వీరిలో దాదాపు 90 శాతం మంది కార్మికులు బీహార్, ఒడిశా, జార్ఖండ్ మరియు ఇతర ప్రాంతాలకు చెందినవారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణలు నిలిచిపోవటం, ఇతర ప్రాంతాల్లో సైతం వెంటనే పని దొరకనందున వీరంతా అమరావతి ప్రాంతాన్ని విడిచిపెడుతున్నారు.. ప్రతి పండుగ సీజన్లో చాలా మంది కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లి మూడు, నాలుగు వారాలు గడిపి.. ఆ తరువాత వచ్చేవారు , అయితే ఈసారి మాత్రం వారు తిరిగి రావడం లేదని మిగిలిన కార్మికులు చెబుతున్నారు. 

Tags:    

Similar News