Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ
Pawan Kalyan: సమావేశంలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో తెలుగు సినీ నిర్మాతల భేటీ
Pawan Kalyan: విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు.. నిర్మాతలు అల్లు అర్వింద్, సి. అశ్వినీదత్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్‌రాజు, డీవీవీ దానయ్య, బోగవల్లి ప్రసాద్, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చిస్తున్నారు. అలాగే.. సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ ఇబ్బందులను కూడా పవన్‌కు వివరించారు నిర్మాతలు.