Nellore: ఓ ప్రైవేట్‌ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో.. ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

Nellore: మృతురాలు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస

Update: 2023-07-02 06:32 GMT

Nellore: ఓ ప్రైవేట్‌ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో.. ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

Nellore: నెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. మూడో సంవత్సరం చదువుతున్న చైతన్య అనే విద్యార్థిని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మెడికో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

చైతన్య నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జన్‌గా చేస్తోంది. రాత్రి ఒంటి గంటకు రోహిణి హాస్టల్ రూమ్ నెంబర్ 4లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు.

Tags:    

Similar News