విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కశింకోట మండలం తాళ్లపాలెంలో గంజాయి సీజ్ చేశారు పోలీసులు. గంజాయిని చింతపల్లిలో కొనుగోలు
విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కశింకోట మండలం తాళ్లపాలెంలో గంజాయి సీజ్ చేశారు పోలీసులు. గంజాయిని చింతపల్లిలో కొనుగోలు చేసి అక్కడ నుంచి చోడవరం, అనకాపల్లి మీదుగా బీహార్ తరలిస్తున్నారన్న సమచారంతో తాళ్లపాలెం వద్ద ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి 561 కేజీల గంజాయితో పాటు 50 వేల నగదును స్వాధీనం చేసుకుని.. లారీని సీజ్ చేశారు పోలీసులు. అలాగే గంజాయి మూలలను పెకిలించేందుకు పోలీస్ యంత్రాంగం దృష్టిసారించింది. ఇప్పటికే అరెస్టైన వారినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.