Nandyala: కాల్‌మనీ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

Nandyala: హరికృష్ణ ఆత్మహత్యతో భగ్గుమన్న మున్సిపల్ కార్మికులు కన్నమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన

Update: 2024-01-10 15:15 GMT

Nandyala: కాల్‌మనీ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

Nandyala: నంద్యాలలో కాల్‌మనీ వేధింపులతో ఓ వ్యక్తి ప్రాణాలు బలయ్యాయి. తాను చేసిన అప్పుకి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు మున్సిపల్ కార్మికుడు హరికృష్ణ. తన చావుకు మాజీ కౌన్సిలర్‌ కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా సందేశం పంపి సూసైడ్‌కి పాల్పడ్డాడు.

నూనెపల్లె మారుతినగర్ వాసి అయిన హరికృష్ణ.. హరిజనవాడకు చెందిన మాజీ కౌన్సిలర్‌ కన్నమ్మ దగ్గర 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. పది రూపాయల వడ్డీ కింద నెలకు పదివేల రూపాయలు చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. తొలి నెల డబ్బులు చెల్లించిన హరికృష్ణ.. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా డబ్బులు లేక రెండో నెల వడ్డీ చెల్లించలేదు. అయితే తనకు వడ్డీ చెల్లించకపోతే పంచాయితీ పెడతానని కన్నమ్మ తనను వేధించిందని సెల్ఫీ వీడియోలో తెలిపాడు హరికృష్ణ.

ఇటీవలే హరికృష్ణ బార్య మరణించగా.. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. తను మరణించాక తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు హరికృష్ణ. ఇక హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. హరికృష్ణ ఆత్మహత్యకు కారణమైన వడ్డీ వ్యాపారిని కఠినంగా శిక్షించాలని, ఆయన బిడ్డలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయొద్దంటూ కుటుంబసభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News