Nara Lokesh: కోల్‌కతా ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన లోకేష్
Nara Lokesh: దారుణాన్ని తలచుకుంటే మాటలు రావడంలేదు
Nara Lokesh: కోల్‌కతా ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన లోకేష్
Nara Lokesh: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనపై ఎక్స్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆమెపై జరిగిన దారుణాన్ని తలచుకుంటే మాటలు రావడంలేదన్నారు. ఈ క్రూరత్వానికి ఏ ఖండన లేదు. న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. బాధితురాలి కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ తాను సంఘీభావం తెలుపుతున్నానని లోకేష్ పోస్టు చేశారు. ప్రతి మహిళకు భద్రత, గౌరవాన్ని ఇవ్వడానికి మనం ఐక్యంగా ఉండాలన్నారు. మంచి మనిషిగా ఉండడమే అత్యంత ప్రభావవంతమైన నిరసన... అబ్బాయిలు, పురుషులందరికీ నా సందేశం ఇదే.! ఇది అందరి పోరాటం కావాలి అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.