Liquor Scam Case: ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

Liquor Scam: గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా భావిస్తున్న భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-01-22 05:32 GMT

Liquor Scam Case: ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

Liquor Scam: గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా భావిస్తున్న భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు.

వైసీపీ ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై గతంలోనే సిట్ (SIT) విచారణ చేపట్టి కేసు నమోదు చేసింది. ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 (A5) గా చేర్చారు.

గతేడాది మే నెలలో ఈ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ, నిందితులపై కేసు నమోదు చేసింది. నిధుల మళ్లింపు, బినామీ లావాదేవీల కోణంలో విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయగా, నేడు ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.


Tags:    

Similar News