Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడి మృతి

Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు.

Update: 2025-10-24 06:19 GMT

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడి మృతి

Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది.

ఈ ప్రమాదం (Kurnool Bus Accident)లో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయాడు. మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్‌గా నిర్ధరించారు. పెళ్లిచూపులు చూస్తున్న సమయంలో శివశంకర్‌ మృతిచెందడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎందుకు బయటకు వెళ్లాడో తమకు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags:    

Similar News