Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి

Kesineni Nani: ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుంది

Update: 2024-01-10 13:19 GMT

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి

Kesineni Nani: టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని నాని.. వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించగానే వైసీపీలో చేరతానన్నారు. సీఎం జగన్‌ పేదల కోసం పనిచేస్తున్నారని, ఆయన అందించిన సంక్షేమ పథకాలు తనకు నచ్చాయన్నారు కేశినేని నాని. అలాగే చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసగాడని ప్రపంచం మొత్తానికి తెలుసని, కానీ పచ్చి మోసగాడు అనే విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి నిరుపయోగమైన వ్యక్తి అని ధ్వజమెత్తారు కేశినేని నాని. జగన్‌ ఏ బాధ్యత అప్పజెబితే అది స్వీకరిస్తా అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని నాని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News