Tiruchanur: తిరుచానూరులో వైభవంగా కార్తిక బ్రహ్మోత్సవాలు

Tiruchanur: సాయంత్రం 4 గంటలకు అమ్మవారి వసంతోత్సవం

Update: 2023-11-14 05:31 GMT

Tiruchanur: తిరుచానూరులో వైభవంగా కార్తిక బ్రహ్మోత్సవాలు

Tiruchanur: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ రాత్రి గజ వాహనంపై అమ్మవారు ఊరేగనున్నారు. శ్రీవారికి గరుడవాహనంలా, అమ్మవారికి ఈ గజవాహనం చాలా విశేషమైనది. శ్రీవారి అలంకరణ ఆభరణాల్లోని లక్ష్మీహారాన్ని ఆలయాధికారులు తిరుచానూరుకు తీసుకెళ్లారు.

ముందుగా హారాన్ని మూలవిరాట్ పాదాల‌ చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇనుప పెట్టెలో హారాన్ని భద్రపరిచి నాలుగు‌మాడా వీధుల్లో ఊరేగించి అనంతరం ప్రత్యేక వాహనంలో తిరుచానూరు తీసుకెళ్లారు. ఇక ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన పంచమితీర్థ మహోత్సవం 18వ తేదీ ఉదయం జరుగనుంది.

Tags:    

Similar News