రేపటినుంచి తిరిగి ప్రారంభం కానున్న బోటు వెలికితీత పనులు!

రేపటినుంచి మళ్ళీ ఆపరేషన్ రాయల్ వశిష్ట

Update: 2019-10-13 11:18 GMT

రేపటినుంచి మళ్ళీ ఆపరేషన్ కచ్చులూరు ప్రారంభం కానుంది. భారీ వర్షాలు గోదావరి ఉద్ధృతి కారణంగా ధర్మాడీ సత్యం బృందం బోటు వెలికితీత పనులను నిలిపివేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మళ్ళీ బోటు వెలికితీత పనులు చేపట్టాలని ధర్మాడీ సత్యం బృందం భావిస్తోంది. దాంతో ధర్మాడీ సత్యం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి వెలికితీత పనులపై చర్చించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని సత్యం అధికారులను కోరారు. దీంతో వారు సత్యం బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రేపు కచ్చులూరు దగ్గర సెర్చ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.

కాగా పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు కొన్ని రోజులు ధర్మాడీ సత్యం బృందం ప్రయత్నాలు చేసింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బోటును ఓడ్డుకు తీసే ప్రయత్నం విఫలమైంది. నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. ఈ క్రమంలో వారంరోజులపాటు భారీ వర్షం కురవడంతో వెలికితీత పనులు నిలిచిపోయాయి. 

Tags:    

Similar News