టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి జూపూడి ప్రభాకర్

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి జూపూడి ప్రభాకర్ టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి జూపూడి ప్రభాకర్

Update: 2019-10-08 05:57 GMT

మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వైసీసీ తీర్థం పుచ్చుకున్నారు జూపూడి . ఆయనతో పాటు జనసేనకు ఇటీవలే రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా వైసీపీలో చేరారు. 2009 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా రాజాకీయ అరంగేట్రం చేశారు జూపూడి ప్ర‌భాక‌ర్‌ రావు. ఆ తర్వాత వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. వైఎస్ మరణాంతరం జగన్ వెంట నడిచారు. వైసీపీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు జూపూడి.

దాంతో వైసీపీలో ఉన్నన్ని రోజులు మీడియాలో ఎప్పటిక‌ప్పుడు బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కొండెపి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నామినేటెడ్ ప‌ద‌విలోనూ జూపూడి ప్రభాక‌ర్‌రావు ను నియ‌మించారు చంద్రబాబు.. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడటంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జూపూడి. ఈ క్రమంలో తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు.

Tags:    

Similar News