Jogi Ramesh: పెడన సభలో తనపై దాడి జరగబోతుంది అని పవన్ కట్టుకథ చెప్తున్నారు
Jogi Ramesh: పెడన సభ విజయవంతం చేసుకోడానికి ఇదొక చీప్ ట్రిక్స్
Jogi Ramesh: పెడన సభలో తనపై దాడి జరగబోతుంది అని పవన్ కట్టుకథ చెప్తున్నారు
Jogi Ramesh: పెడన సభలో తనపై దాడి జరగబోతుదంటూ పవన్ కట్టు కథ చెప్తున్నాడన్నారు మంత్రి జోగి రమేష్ .ఆడలేక మద్దెల దరువు అన్న సామెత పవన్‌కి సరిగ్గా సూట్ అవుతుందని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు కోటలు దాటతాయి.. చేతలు మాత్రం శూన్యం అని తెలిపారు. అవనిగడ్డలో జనం రాలేదని పెడనసభ కోసం ఇలాంటి డ్రామాకు తెరలేపారన్నారు. పెడన నియోజకవర్గంలో రైతులు,చేనేత కార్మికులు అంతా శాంతిపరులన్నారు. పెడన సభ విజయవంతం చేసుకోడానికి ఇదొక చీప్‌ట్రిక్స్ అన్నారు. పెడనలో హింస రేకెత్తించదానికి పవన్ కుట్ర చేస్తున్నాడన్న మంత్రి.. విధ్వంసకర పరిస్థితి సృష్టించాలని చూస్తున్నాడని తెలిపారు. పవన్‌కి అంత భయం ఉంటే నేను వచ్చి యాత్రను ముందుకు నడిపిస్తా అని ఎద్దేవా చేశారు.