మానసికంగా బాధ పెట్టారు : జేసీ దివాకర్ రెడ్డి

Update: 2020-01-04 16:24 GMT
Jc diwakar reddy

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బెయిలు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. షరతులతో కూడిన బెయిల్ రావడంతో స్టేషన్ నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు విచారణ కోసం అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు జేసీని తరలించిన పోలీసులు సుమారు 8 గంటల పాటు విచారణ చేపట్టారు. విచారణ పూర్తి కావడంతో.. కండీషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మానసికంగా హింసించేందుకే స్టేషన్‌లో ఉంచారని మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఏమీ చేసినా భయపడేది లేదని.. యాక్షన్‌కు రియాక్షన్ తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు.

ఇటు జేసీని రోజంతా విచారణ జరిపిన పోలీసులు.. స్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టేషన్ గేటు వేసిన పోలీసులు.. మీడియాను, పార్టీ కార్యకర్తలను లోనికి అనుమతించలేదు. మరోవైపు సాయంత్రం టీటీడీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, కార్యకర్తలు స్టేషన్‌ దగ్గరకు రావడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఉన్న సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ అన్నారు. దీనిపై కేసు నమోదు కాగా.. అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన్ని విచారించారు.  


Full View


Tags:    

Similar News