హైదరాబాద్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల తరలింపు
JC Diwakar Reddy: బందోబస్తుతో తరలించిన పోలీసులు
హైదరాబాద్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల తరలింపు
JC Diwakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు వద్ద హైదరాబాద్ తరలించారు. ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జేసి దివాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉంటే సమస్యలు పునరావృతం అవుతాయంటూ పోలీసులు చెప్పారు. తాడిపత్రి వదిలి వెళ్లాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు.