జనసేనకు మరో నేత టాటా.. బీజేపీలోకి..

జనసేనకు మరో షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు

Update: 2019-10-25 01:31 GMT

జనసేనకు మరో షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు టాటా చెప్పేశారు. ఇటీవలే జరగిన ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థి, జియోలజిస్ట్‌ ధరణికోట వెంకటరమణ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎన్నికల ముందే జనసేనలో చేరిన ఆయన అనూహ్యంగా పోటీలో నిలిచారు. కేవలం 1311 ఓట్లు మాత్రమే సాధించి ఘోరంగా ఓటమి పాలయ్యారు. బీజేపీ తరపున పోటీ చేసిన ఏపీ శ్రీకాంత్‌కు 577 ఓట్లు లభించాయి. ఎన్నికల తర్వాత కూడా జనసేనలో కీలకంగా వ్యవహరించిన ధరణికోట ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బీజేపీ నిర్వహించిన బాపూజీ సంకల్పయాత్రకు మద్దతు తెలిపారు. ఆ సమయంలోనే సుజనా చౌదరితో భేటీ అయి బీజేపీలో చేరిక విషయంపై చర్చించారు.

బీజేపీ రాష్ట్ర అధిష్టానం నుంచి అనుమతి వచ్చింది.. ఈ క్రమంలో రమణ గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీకాంత్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నోముల రఘు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాసరావు, కీసర రాంబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ధరణికోట మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరానని.. అందువల్లే జనసేనకు రాజీనామా చేశానని చేప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని.. ఏపీకి న్యాయం చెయ్యాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

Tags:    

Similar News