Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు

Pawan Kalyan: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ అభివృద్ధిలో భాగమయ్యేలా జనసేన కమిటీలు పని చేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.

Update: 2025-12-03 09:00 GMT

Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా అధినేత పవన్ కీలక సూచనలు చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వరకు కమిటీల నియమించాలన్నారు. ప్రతీ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీరంతా తమ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా పనిచేయాలని తెలిపారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు కానుండగా.. ఇందులో 11 మంది సభ్యులు ఉండనున్నారు. ప్రతీ కమిటీలో మహిళలకు స్థానం కల్పించనున్నారు. ఐదుగురు సభ్యుల కమిటీలో గరిష్టంగా ఇద్దరు మహిళలు.. 11 మంది సభ్యుల కమిటీలో ముగ్గురు మహిళలు ఉండాలని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News