Jaggampeta: నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ

Update: 2020-04-19 08:56 GMT

జగ్గంపేట: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాట్రావులపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఇంటి నుండి బయటకు రాకుండా నివసిస్తున్న పేద ప్రజలకు సుమారు నాలుగువేల కుటుంబాలకు కూరగాయలు చింత పండు, బెల్లం, టీ, పొడి నిత్యావసర వస్తువులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ తమ వంతు సాయంగా కూరగాయలను, గుడ్లను అందజేస్తున్నామని. ప్రతి ఒక్కరూ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరు ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, ఏలేటి బాబి, ముసిరెడ్డి నాగేశ్వరరావు, సుంకర సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News